: డీసీపీతో తలసాని వాగ్వాదం


హైదరాబాదు ఉత్తర మండల డీసీపీ ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలను పురస్కరించుకుని మంత్రి తలసాని తన నివాసం వద్ద ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి డీజేతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే డీజే కార్యక్రమాలకు అనుమతి లేదని, పెద్ద శబ్దం కారణంగా చుట్టుపక్కలవారు ఇబ్బంది పడే అవకాశం ఉందని డీసీపీ ప్రకాశ్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News