: ఐఎస్ఐఎస్ లో ఏడుగురు భారతీయులు...ఒకరు తెలంగాణ వ్యక్తి


అరాచకాల ఐఎస్ఐఎస్ లో ఏడుగురు భారతీయులు ఉన్నారని నిఘావర్గాలు చెబుతున్నాయి. వీరిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది. ఈ ఏడుగురు కాకుండా మరో ఆరుగురు భారతీయులు ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతూ మృత్యువాత పడ్డారని నిఘావర్గాలు వెల్లడించాయి. మరణించిన వారిలో ముగ్గురు ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన వారు కాగా, ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు, ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని నిఘావర్గాలు చెప్పాయి. బతికి ఉన్న ఏడుగురిలో ఒకర్ని మాత్రమే ఐఎస్ఐఎస్ పోరాటంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. మిగిలిన ఆరుగురు వంటవాళ్లు, డ్రైవర్లు, పనివాళ్లుగా కుదురుకున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. కాగా, తెలంగాణ నుంచి సిరియా వెళ్లేందుకు 17 మంది అనుమతి కోరగా, వారంతా ఐఎస్ఐఎస్ లో చేరే ప్రమాదం ఉందని భావించిన అధికారులు వారి అనుమతిని నిరాకరించినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News