: ఫోన్ మోజు...డ్రోన్ వైపు మళ్లుతుంది: 'నాసా' భారత సంతతి శాస్త్రవేత్త


ఫోన్ పై ఉన్న మోజు డ్రోన్ వైపు మళ్లుతుందని నాసాలో భారత సంతతి శాస్త్రవేత్త పరిమళ్ కోప్డేకర్ తెలిపారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని మౌంటెన్ వ్యూలో 'అన్ మేన్డ్ యేరియల్ సిస్టమ్' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదు పదేళ్లలో ఇంటికో డ్రోన్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటి పైకప్పుపై ఉండి అవి మనకు పహారా కాస్తాయని అన్నారు. దానిని తాను స్వయంగా చూస్తానని తెలిపారు. సరకుల చేరవేత దగ్గర్నుంచి, ఇంటి పనులను చేస్తూనే, మన డైలీ షెడ్యూల్ ను కూడా చక్కబెట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్ పై ఉన్న మోజు తగ్గిపోయి, డ్రోన్ ను సొంతం చేసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతారని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News