: రైతులను టీఎస్ ప్రభుత్వం మోసం చేసింది: కోదండరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. పంటల బీమా మొత్తం రూ. 90 కోట్లను పెండింగ్ లో పెట్టారని... ఇది సరికాదని ఆయన అన్నారు. ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీల బీమా ప్రీమియంలో అవకతవకలు ఉన్నాయని... ఈ అవకతవకలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.