: ఎంసీఏకి కృతజ్ఞతలు తెలిపిన షారుఖ్
వాంఖడే స్టేడియంలో ప్రవేశించకుండా మూడేళ్లుగా తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. 2012 మే 18న కోల్ కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత వాంఖడే స్టేడియం స్టాఫ్ తో ఇబ్బందికరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో షారుఖ్ పై నిషేధం విధించారు. వాస్తవంగా షారుఖ్ పై ఐదేళ్ల బ్యాన్ ఉంది... అయినప్పటికీ, ఎంసీఏ నిర్ణయాన్ని గౌరవించి స్టేడియం వద్దకు ఇంతవరకు రానందున... ఆయన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని బ్యాన్ ఎత్తివేశారు.