: జనావాసాలపై కూలిన యుద్ధ విమానం, 25 మంది మృతి
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు వెళ్లిన ఓ యుద్ధ విమానం అదుపుతప్పి జనావాసాలపై కూలింది. ఈ ఘటన సిరియాలో సంభవించగా, సుమారు 25 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది. సిరియా నైరుతీ ప్రాంతంలోని జెరికో నగరంలో ఈ ఉదయం దుర్ఘటన జరిగింది. ఇళ్ల మీద విమానం కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. విమానంలోని సిబ్బంది జాడ తెలియలేదని సిరియా సైనిక అధికారి ఒకరు వివరించారు. వీరు ఏమైనారన్న విషయం, విమానం ఎందుకు కూలిందన్న సమాచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.