: ఓరుగల్లులో ప్రేమోన్మాది ఘాతుకం... ప్రేమించలేదని విద్యార్థిని గొంతు కోసిన వైనం


చట్టాలు ఎంత కఠినమవుతున్నా మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎక్కడికక్కడ ప్రేమ పేరిట యువతులను వేధించడమే కాక, తమ దారికి రాని ఆడ పిల్లలను మట్టుపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ తరహా ప్రేమోన్మాది దాడికి మరో అమాయకురాలు ఆస్పత్రి పాలైంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలోని వరంగల్ నగరంలో ప్రేమిస్తున్నానంటూ ఓ ప్రేమోన్మాది ఓ విద్యార్థిని వెంటబడ్డాడు. అతడి ప్రతిపాదనను సదరు బాలిక తిరస్కరించింది. దీంతో మానవ మృగంలా మారిన ఆ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతు నులిమేశాడు. దీనిని గమనించిన స్థానికులు విద్యార్థినిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News