: మెదక్ జిల్లాలో ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం
మెదక్ జిల్లాలో నేటి ఉదయం ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లాలోని సదాశివపేట మండలానికి చెందిన మద్దికుంట, తంగేడుపల్లి ఎంపీటీసీలు అపహరణకు గురయ్యారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాపైన ఎంపీటీసీల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలోనే ఎంపీటీసీలు కిడ్నాప్ నకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.