: విరుచుకుపడుతున్న ఈజిప్ట్ సైన్యం... 88 మంది ఉగ్రవాదుల హతం


ఉగ్రవాదులపై ఈజిప్ట్ సైన్యం పంజా విసిరింది. నిత్యం బాంబు దాడులు, విదేశీయుల కిడ్నాప్ లతో దేశం అల్లకల్లోలంగా మారడంతో, ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. గత 10 రోజుల వ్యవధిలో ఏకంగా 88 ఉగ్రవాదులను ఈజిప్ట్ సైన్యం మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సైన్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాదుల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టిన సైన్యం.. వారిపై భారీ ఎత్తున దాడులకు తెర తీసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన 40 కార్లు, వ్యాన్లతో పాటు 36 బైకులను కూడా స్వాధీనం చేసుకుంది. దేశంలో ఉగ్రవాద మూలాలను పెకిలించేంత వరకు విశ్రమించమని ఈ సందర్భంగా సైన్యాధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News