: కాంగ్రెస్ రోడ్డున పడేస్తే... బీజేపీ బికారులను చేస్తోంది: ప్రత్యేక హోదా సాధన సమితి


ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి ప్రతిజ్ఞ చేసింది. అనంతపురం మెడికల్ కాలేజీలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులను రోడ్డున పడేస్తే... ప్రత్యేక హోదా ఇవ్వకుండా సీమాంధ్రులను మరింత బికారులను చేసే పనిలో బీజేపీ పడిందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు డిమాండ్ చేసిన బీజేపీ... తీరా అధికారంలోకి రాగానే తన డిమాండ్ ను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News