: కుక్కకూ హెల్మెట్ పెట్టాడు... ప్రశంసలు పొందుతున్నాడు!
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన శునకానికి కూడా ప్రాణ రక్షణ ఉండాలని భావించాడో యువకుడు. బైకుపై వెళుతూ, వెనక కూర్చున్న శునకానికీ హెల్మెట్ పెట్టి, ఢిల్లీలోని డీఎన్డీ ఫ్లై ఓవర్ పై రయ్ మంటూ దూసుకెళ్లాడు. ఈ దృశ్యం ఆ దారిలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులను ఆకర్షించింది. కొందరు ఔత్సాహికులు దీన్ని తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. హెల్మెట్ విలువను తెలిపేలా ఉన్న వీడియోపై, ఆ శునకం యజమానిపై సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.