: రూ. 10కే గూగుల్ ప్లే స్టోర్ పెయిడ్ యాప్స్
ఇప్పటి వరకూ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో ఉచిత యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకుని వాడుకుంటున్నారా? పెయిడ్ యాప్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారా? అందుకే, పెయిడ్ యాప్స్ ను అతి తక్కువ ధరకు అందించాలని ప్లే స్టోర్ నిర్ణయించింది. కేవలం రూ. 10కే ఒక్కో యాప్ ను ఇస్తామని, ఇండియాలో పెయిడ్ యాప్స్ వాడకాన్ని మరింతగా పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ డెవెలపర్లు ఎక్కువ మంది యూజర్లను చేరుకుంటున్నారని, తమకు భారత్ ఓ పెద్ద మార్కెట్ అని గూగుల్ ప్లే మేనేజర్ వివరించారు.