: యాకూబ్ మెమన్ ఉరి తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాజీనామా


యాకూబ్ మెమన్ కు గంటల వ్యవధిలో రెండుసార్లు మరణశిక్షను ఖరారు చేయడాన్ని భారత న్యాయ చరిత్రలో 'చీకటి గంటలు'గా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనూప్ సురేంద్రనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించి, రిలీవింగ్ లెటర్ కూడా ఇచ్చినట్టు కోర్టు వర్గాలు వెల్లడించాయి. 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఒక తీర్పిచ్చి, దాన్ని పరిశీలించాలని కోరితే, 12 గంటల వ్యవధిలో పరిశీలన పూర్తి చేసి అదే తీర్పును ఖరారు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో 20 మంది వరకూ డిప్యూటీ రిజిస్ట్రార్ లు ఉన్నారు. నేషనల్ లా యూనివర్శిటీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న సురేంద్రనాథ్, మెమన్ డెత్ వారంట్ పిటిషన్ ను ఫైల్ చేసిన సమయంలో విధులు నిర్వహించారు.

  • Loading...

More Telugu News