: అమ్మాయిలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
ఆదిలాబాద్ జిల్లాలో యువతులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. యువతులకు ఉపాధి సౌకర్యం కల్పిస్తామని మాయమాటలు చెబుతూ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విక్రయించే ముఠాను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని గిరిజన గ్రామాలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జైనూర్ గ్రామాల నుంచి అమ్మాయిలను ఉపాధి పేరుతో తీసుకెళ్లి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు విక్రయించిన ముఠా సభ్యులు మరోసారి ఆ ప్రాంతాల్లో కనబడేసరికి అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకుని ఇంద్రవెల్లి పోలీసులకు అప్పగించారు. దీంతో భీంరావు, హరీసింగ్, జంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.