: యాకూబ్ భార్యకు ఎంపీ సీటు ఇవ్వాలన్న సమాజ్ వాదీ నేతపై వేటు
యాకూబ్ మెమన్ భార్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ లేఖ రాసిన మహారాష్ట్ర సమాజ్ వాదీ విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ గోసీపై వేటు పడింది. పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అంతేగాక గోసీని సమాజ్ వాదీ పార్టీ నుంచి కూడా తొలగించే అవకాశముందని సమాచారం. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అబూ అసిం అజ్మీ మాట్లాడుతూ, గోసీ లేఖపై వివరణకోరే అవకాశముందని చెప్పారు. అతని వ్యాఖ్యలపై పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు.