: రాహుల్, జగన్ లపై చంద్రబాబు ఫైర్... ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలపై ఏకకాలంలో విరుచుకుపడ్డారు. నేటి ఉదయం విజయవాడలో మొదలైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు వారిద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు పదేళ్ల తర్వాత కాని రాహుల్ గాంధీకి గుర్తుకు రాలేదని ఆయన దెప్పిపొడిచారు. ఇక రాయలసీమకు నీరు రావడం ఇష్టంలేని వైఎస్ జగన్ కు పట్టిసీమ గురించి మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు అన్నారు. నూతన రాజధానిని నిర్మించడం కూడా జగన్ కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరతానని చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News