: హైదరాబాదులో ఇళ్ల బయట కారు పార్కు చేస్తే... అద్దాలు పగిలిపోతాయంతే!
నిజమేనండోయ్... భాగ్యనగరిలో ఇళ్ల బయట పార్కు చేసే కార్లపై ఆకతాయిలు విరుచుకుపడుతున్నారు. రాత్రి వేళ్లలో కర్రలు, రాళ్లు చేతబట్టి వరుస పెట్టి మరీ కార్ల అద్దాలను పగులగొడుతున్నారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహా ఘటన దిల్ సుఖ్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడి కోదండరాంనగర్, పీ అండ్ టీ కాలనీ, శారదా నగర్ ల పరిధిలో ఇళ్ల ముందు పార్కు చేసిన కార్లపై గుర్తు తెలియని ఆకతాయిలు విరుచుకుపడ్డారు. దాదాపు 18 కార్ల అద్దాలను పగులగొట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆకతాయిలను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.