: విజయవాడ మార్కెట్లో ఏపీ మహిళా మంత్రులు...రూ.20లకే కిలో ఉల్లి కేంద్రం ప్రారంభం


ఏపీ కేబినెట్ లోని మహిళా మంత్రులు పరిటాల సునీత, కిమిడి మృణాళిని, పీతల సుజాతలు నేటి ఉదయం విజయవాడలోని మార్కెట్ లో ప్రత్యక్షమయ్యారు. నిన్న కేబినెట్ సమావేశంలో పాల్గొన్న వీరు, నేటి పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు అక్కడే ఉన్నారు. ఉదయమే ముగ్గురు మహిళా మంత్రులు కలిసి నగరంలోని ప్రధాన మార్కెట్ కు చేరుకున్నారు. మార్కెట్ లో కలియదిరిగిన అనంతరం రూ.20 కే కిలో ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పిన సునీత, తక్కువ ధరే అయినా నాణ్యమైన ఉల్లిపాయలనే వినియోగదారులకు అందిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News