: ట్యాపింగ్ జరగలేదని నాడు కేసీఆర్ బుకాయించారు... నేడు కోర్టు ముందు మోకరిల్లారు: అచ్చెన్నాయుడు


ఫోన్ ట్యాపింగ్ జరగనేలేదంటూ సీఎం కేసీఆర్ మొన్నటి వరకూ బుకాయించడంపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడుతున్నారు. అప్పుడసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని, ఇప్పుడు కోర్టు కెళ్లి ట్యాపింగ్ వివరాలు ఇవ్వొద్దని మోకరిల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని విజయవాడలో అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటన ఏపీకి వర్తించదన్నారు. రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని నాడు రాజ్యసభలో బీజేపీ చెప్పిందని, అందుకని తప్పకుండా వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రత్యేక హోదా కోసం జగన్ కృషి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.

  • Loading...

More Telugu News