: ప్రేమించినోడిని మనువాడేందుకు కోయంబత్తూరు యువతి ‘అత్యాచార’ నాటకం!


మనసారా ప్రేమించిన యవకుడిని పెళ్లి చేసుకోవాలని తలచింది ఆ యువతి. తల్లిదండ్రుల నిరాకరణతో నిదానంగా ఒప్పిద్దాంలే అనుకుంది. అయితే పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టిన తల్లిదండ్రులను ఎలా నిలువరించాలో తెలియలేదట. చివరకు ‘అత్యాచార’ నాటకానికి తెరతీసింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకెళితే... తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన ఓ యువతి ఉద్యోగం నిమిత్తం ఏడాదిగా హాస్టల్ లో ఉంటోంది. ఈ నెల 28న తన గదిలో కాళ్లు, చేతులు కట్టిపడేసిన స్థితిలో ఆమె హాస్టల్ నిర్వాహకులకు కనిపించింది. విషయమేంటని ఆరా తీస్తే, ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని నాటకం మొదలెట్టింది. రంగప్రవేశం చేసిన పోలీసులు విచారించగా పొంతన లేని సమాధానాలిచ్చిందట. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కాస్త గట్టిగా కదిలించగా, అసలు విషయం బయటపెట్టింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకే ఈ నాటకానికి తెరతీసినట్లు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు నాటకాలాడితే కేసులు పెడతామని హెచ్చరించి వదిలేశారట.

  • Loading...

More Telugu News