: యాకూబ్ మెమన్ అరెస్ట్ పై నాడు దావూద్ ఇబ్రహీం స్పందన ఏంటంటే...?


‘‘యాకూబ్ మెమన్ పట్టుబడ్డాడా? ఐ యామ్ హ్యాపీ. ఇప్పటికైనా దర్యాప్తు సరైన ట్రాక్ పైకి వచ్చింది’’ అని అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం వ్యాఖ్యానించాడు. 20 ఏళ్ల క్రితం యాకూబ్ మెమన్ అరెస్ట్ సందర్భంగా జాతీయ ఆంగ్ల పత్రికకు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో దావూద్ పై విధంగా స్పందించాడు. అంతేకాక ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కూడా అతడు చెప్పాడు. అయినా యాకూబ్ మెమన్ తనను ఎన్నడూ కలవలేదని, అసలు అతడి ముఖాన్నే తాను చూడలేదని కూడా పేర్కొన్నాడు. యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలైన నేపథ్యంలో నాటి ఇంటర్వ్యూ మరోసారి తెరపైకి వచ్చింది.

  • Loading...

More Telugu News