: 'టెన్నిస్' అక్కాచెళ్లెళ్లు ఒక్కటయ్యారు...ఆపడం సాధ్యమా?
అంతర్జాతీయ మహిళల టెన్నిస్ లో వీనస్ విలియమ్స్, సెరెనా విలిమ్స్ సాధించిన విజయాలు, ట్రోఫీలు అనితరసాధ్యమైనవి. మహిళల సింగిల్స్ లో వీరు సాధించని విజయాలు అంటూ లేవంటే అతిశయోక్తి కాదు. ఒంటరిగా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న వీరిద్దరూ కెరీర్ చివరిదశకు చేరుకుంటున్నారు. కొత్త క్రీడాకారిణులు వస్తున్నా వీరి ప్రతిభకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. తాత్కాలికంగా ఎవరైనా బ్రేక్ వేసినా, వెంటనే పుంజుకుని సత్తా చాటుతున్నారీ సోదరీమణులు. సింగిల్స్ లో ఎన్నో ట్రోఫీలు సాధించిన వీరిద్దరూ జోడీగా డబుల్స్ లో అడుగుపెడితే? ఇక ఈ జోడీని నిలువరించడం ఎవరి వల్లా సాధ్యం కాదేమో. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే జోడీ కట్టనున్నారు. ఈ మేరకు కలిసి ప్రాక్టీస్ చేసిన సెల్ఫీని వీనస్ విలియమ్స్ ట్విట్టర్లో పోస్టు చేస్తూ, జోడీగా దిగనున్నట్టు తెలిపింది. తమని ఆపడం ఎవరికైనా సాధ్యమైతే ఆపుకొమ్మని సవాలు విసిరింది. అయితే అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు.