: పట్టిసీమకు మరో రూ. 200 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం


పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లను కేటాయించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. అనుకున్న సమయానికల్లా ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ మొత్తం అవసరమవుతుందని పోలవరం చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదన పంపారని... దీంతో, ప్రతిపాదనను ఆమోదించి, నిధులను మంజూరు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, రాయలసీమకు నీటిని ఇవ్వాలనే లక్ష్యంతోనే నిధులు విడుదల చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు గతంలో రూ. 1300 కోట్లు కేటాయించారు.

  • Loading...

More Telugu News