: పల్నాడు ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న 9 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తుపాకులు, కత్తులతో సంచరిస్తున్న 9 మందిని వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మాచర్ల, దుర్గి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారని తెలుస్తోంది. ఈ 9 మందిపై 23 కేసులను నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరి నుంచి భారీగా నగదు, ఆభరణాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి రెండు తుపాకులు, బులెట్లు, 4 కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీరంతా ఓ దొంగల ముఠాకు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.