: తలసాని రాజీనామాపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు: మర్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పీకర్ మధుసూదనాచారి సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తక్షణమే తలసానిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా తలసాని రాజీనామాపై చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు మర్రి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్ లు స్పీకర్ ను కలిశారు. వెంటనే తలసాని రాజీనామాను ఆమోదించాలని కోరారు. అనంతరం మర్రి మీడియాతో మాట్లాడుతూ, రాజీనామాను పెండింగ్ లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే ఆమోదించారంటూ గుర్తు చేశారు.