: తాలిబన్ గ్రూప్ కొత్త లీడర్ గా ముల్లా అక్తర్ మన్సోర్
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సుప్రీం కమాండర్ గా కొత్త నాయకుడుని ఎంపిక చేశారు. ముల్లా మహ్మద్ ఒమర్ చనిపోయినట్టు ఇటీవల ప్రకటించడంతో నూతన నాయకుడిగా ముల్లా అక్తర్ మన్సోర్ ను ఎన్నుకున్నట్టు తాలిబన్ తమ వెబ్ సైట్ లో తెలిపింది. సుదీర్ఘకాలం నుంచి ఒమర్ కు నమ్మకస్తుడుగా, సన్నిహితుడుగా ఉంటున్నందువల్లే మన్సోర్ ను నియమించినట్టు వారి పాష్టో భాషలో పేర్కొన్నారు. కాగా ఒమర్ తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న తాలిబన్ గ్రూప్, ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం వెల్లడించలేదు.