: వైయస్ ఫొటో తొలగింపుపై ఆందోళన తీవ్రతరం... అసెంబ్లీ ఆవరణలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బైఠాయింపు


శాసనసభ ఆవరణలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ లాంజ్ లో తొలగించిన దివంగత వైయస్సార్ ఫొటోను వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, 11 గంటల సమయంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలవడానికి వెళ్లారు. అయితే ఆయన లేకపోవడంతో ఏపీ అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం, వైయస్ ఫొటోను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, వైయస్ ఫొటో తొలగించడం మంచిది కాదని చెప్పారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, స్పీకర్ కోడెల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News