: ఏపీ సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు తెలంగాణకు కేటాయింపు... సెక్రటేరియట్ లో మరో వివాదం


ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సచివాలయంలో మరో కొత్త వివాదం మొదలైంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాచిన ఆంజనేయులును అధికారుల విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించారు. ప్రస్తుతం ఆయన ఏపీ న్యాయశాఖ ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ క్రమంలో, విధుల్లో చేరడానికి నిన్న ఆయన తెలంగాణ సచివాలయానికి వెళ్లారు. దీంతో, తెలంగాణ అధికారులు కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై ఏపీ చీఫ్ సెక్రటరీకి ఆయన ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఏపీ అధికారి అయిన ఆంజనేయులును తాము ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించమని టి.సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News