: దసరా తర్వాత ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ... మార్పుచేర్పులపై బాబు కసరత్తు!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సీఎం నారా చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ లోని ఇద్దరి నుంచి ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న చంద్రబాబు, కొత్తగా ఐదు నుంచి ఆరుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో చేయాల్సిన మార్పుచేర్పులకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విజయదశమి (దసరా) తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక పలువురి మంత్రుల పోర్ట్ ఫోలియోల్లోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.