: ఉస్మానియా భవనాలు కూల్చవద్దు: అసదుద్దీన్ ఒవైసీ
ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కూల్చవద్దని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉస్మానియా కట్టడాలు హైదరాబాదుకే కాదు...యావత్ దేశానికే తలమానికమని అన్నారు. వారసత్వంగా వస్తున్న ఉస్మానియా భవనాల కూల్చివేత సరికాదని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉస్మానియా భవనాలను చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షించాలని ఆయన సూచించారు. కావాలంటే ఉస్మానియా ప్రాంగణంలోని ఏడెకరాల స్థలంలో భవనాలు నిర్మించాలని ఆయన తెలిపారు.