: దానంతో తలసాని భేటీ...సర్వత్ర ఆసక్తి


హైదరాబాదు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిశారు. దానం నాగేందర్ పార్టీ మారనున్నారని, టీఆర్ఎస్ లో చేరనున్నారని, సరైన సమయం కోసం చూస్తున్నారని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పటికప్పుడు ఆయన ఆ వార్తలను ఖండిస్తూ, అన్నీ పుకార్లని కొట్టేపడేశారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దానంతో తలసాని భేటీ కావడంపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. వీరి భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి? అని రాజకీయ వర్గాలు ఊహాగానాలు మొదలుపెట్టాయి.

  • Loading...

More Telugu News