: ముంబయిలోని బడా ఖబరస్థాన్ లో యాకుబ్ అంత్యక్రియలు పూర్తి


యాకుబ్ మెమన్ మృతదేహానికి ముంబయిలోని బడా ఖబరస్థాన్ లో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నాగపూర్ నుంచి ముంబయి కి విమానంలో అతని మృతదేహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఓ వ్యాన్ లో మాహిమ్ దర్గాకి తీసుకెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. తరువాత మాహిమ్ ప్రాంతంలో ఉన్న అతని సోదరుడు సులేమాన్ మెమన్ ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి అనంతరం అంత్యక్రియల కోసం బడా ఖబరస్థాన్ కు తీసుకెళ్లారు. అక్కడే కుటుంబ సభ్యులు ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో సులేమాన్ ఇంటికి, ఖబరస్థాన్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.

  • Loading...

More Telugu News