: మెమన్ ఉరిని నిరసిస్తూ జమ్ము కాశ్మీర్ ఎమ్మెల్యే ర్యాలీ
టెర్రరిస్ట్ యాకుబ్ మెమన్ ను ఉరితీయడాన్ని నిరసిస్తూ జమ్ము కాశ్మీర్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ర్యాలీ నిర్వహించారు. స్వత్రంత ఎమ్మెల్యే అయిన షేక్ అబ్దుల్ రషీద్ తన అనుచరులతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉరికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజీవ్ హత్య కేసులో నిందితులను ఎందుకు ఉరితీయడం లేదంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ ర్యాలీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ర్యాలీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.