: యాకూబ్, కలాంలను పోలుస్తూ కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన దిగ్విజయ్ సింగ్


"ఎంతటి యాదృచ్ఛికం! ఇద్దరు భారతీయ ముస్లింల అంత్యక్రియలు ఒకే రోజు జరుగుతున్నాయి. ఇండియాలో కలాం సాధించిన ఘనతల పట్ల ప్రతిఒక్కరూ గర్వపడుతున్నారు. యూకూబ్ ఉగ్రవాదులతో చేతులు కలిపి మొత్తం ముస్లింలకే సిగ్గు చేటుగా నిలిచాడు" అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఓ మహానుభావుడిని, ఓ ఉగ్రవాదిని పోలుస్తూ, ఒకే చోట అభిప్రాయాలు పెట్టడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. బీజేపీ మరో అడుగు ముందుకేసి, దిగ్విజయ్ వెలిబుచ్చిన అభిప్రాయాలను తక్షణమే ఖండించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను డిమాండ్ చేసింది. లేకుంటే ఆయన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నట్టు ప్రకటించాలని ఆ పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలో వారే చెప్పాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News