: తెలంగాణలో రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత రైతు రుణమాఫీకి నిధులు విడుదలయ్యాయి. మొదటి ఏడాది అంటే గత సంవత్సరం రైతులకు 25 శాతం రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఈ సంవత్సరానికిగానూ 20 రోజుల కిందట రూ.2,043 కోట్లు విడుదల చేయగా, ఈరోజు తిరిగి అంతే మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాంతో ఇంతవరకు 50 శాతం రైతు రుణమాఫీ జరిగినట్టు తెలిపింది. మిగతా 50 శాతం మాఫీని రాబోయే రెండేళ్లలో ప్రభుత్వం పూర్తి చేస్తుంది.