: ముల్లా ఒమర్ మృతిపై కథనాలు నమ్మదగినవే: వైట్ హౌస్
ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ గ్రూప్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మృతి చెందినట్టు బీబీసీ వార్తా సంస్థ పేర్కొనడంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ స్పందించింది. ఒమర్ మృతిపై కథనాలు విశ్వసించదగినవేనని వైట్ హౌస్ ప్రతినిధి ఎరిక్ షుల్జ్ పేర్కొన్నారు. నిఘా వర్గాలు ఈ కథనాలను పరిశీలిస్తున్నాయని, ఒమర్ మరణానికి సంబంధించిన అంశాలను విశ్లేషిస్తున్నాయని తెలిపారు. అంతకు మించి దీనిపై మాట్లాడలేమని అన్నారు. తాలిబాన్ అధినేత అయిన ముల్లా ఒమర్ ను ఒంటి కన్ను ఒమర్ అని పిలుస్తారు. కాగా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి అనంతరం... అల్ ఖైదాకు ఆఫ్ఘన్ లో మద్దతుగా నిలిచిన తాలిబాన్లపై అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దాంతో, ముల్లా ఒమర్ పాకిస్థాన్ కు పారిపోయాడు. అటు పిమ్మట జరిగిన దాడుల్లో ఒమర్ మరణించినట్టు ఎన్నో కథనాలు వచ్చాయి. వాటన్నంటినీ నిర్ధారించని ఆఫ్ఘన్ ప్రభుత్వం తాజా కథనంపై స్పందిస్తూ ముల్లా ఒమర్ మరణించినట్టు పేర్కొంది.