: గోల్ చేసిన ధోనీ


బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ తర్వాత జింబాబ్వే టూర్ కు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్న ఎమ్మెస్ ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. అయితే, ధోనీ వచ్చింది క్రికెట్ ఆడేందుకు కాదు, నెల రోజుల విరామం అనంతరం, శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు సాకర్ ఫీల్డ్ కు వచ్చాడు. మామూలుగానే ఫుట్ బాల్ అంటే అమితంగా ఇష్టపడే ధోనీ, టీమిండియా మ్యాచ్ సన్నాహాల్లోనూ సాకర్ ను భాగం చేశాడు. అటుపై ఎప్పుడు వీలుచిక్కినా బంతిని తన్నేందుకు ఆసక్తి చూపడం తెలిసిందే. తాజాగా, రాంచీలో సిల్లి స్టేడియంలో జరిగిన సాకర్ మ్యాచ్ లో ధోనీ 90 నిమిషాల పాటు బంతి వెంట పరుగులు తీశాడు. ఈ మ్యాచ్ లో ధోనీ ఓ గోల్ కూడా చేయడం విశేషం. పాతమిత్రుడు సుదేశ్ ఆహ్వానం మేరకు ఈ జార్ఖండ్ డైనమైట్ సాకర్ బరిలో దిగాడట. లెఫ్ట్ ఫ్లాంక్ లో ఆడిన ధోనీ మొత్తమ్మీద ప్రొఫెషనల్ టచ్ ఇచ్చాడు. తనకందిన ఓ పాస్ ను గోల్ గా మలచి అందరినీ అలరించాడు.

  • Loading...

More Telugu News