: క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరిన హిల్లరీ క్లింటన్
క్యూబాపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా చట్టసభ సభ్యులను హిల్లరీ క్లింటన్ కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆమె మియామీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విన్నపం చేశారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, వారి పోటీదారైన రిపబ్లికన్ పార్టీ మాత్రం హిల్లరీ వ్యాఖ్యలను ఖండించింది. క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ అనేది విఫలమైన గత విధానాలను గుర్తుకు తెస్తోందని తెలిపింది. డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వానికి అందరి కంటే హిల్లరీనే ముందంజలో ఉన్నారు.