: యాకుబ్ ఉరిపై నేడు ‘మహా’ అసెంబ్లీలో సీఎం ఫడ్నవీస్ ప్రకటన
ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ కొద్దిసేపటి క్రితం ఉరి కంబమెక్కాడు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేయనున్నారు. యాకుబ్ మెమన్ ఉరి శిక్షపై నిన్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధం జరిగింది. ఉరి శిక్షపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పై బీజేపీ, శివసేనలు ముప్పేట దాడి చేశాయి. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో నేటి ఉదయం నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు యాకుబ్ ను ఉరి తీశారు. దీనిపై ఫడ్నవీస్ నేడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.