: దేశవ్యాప్తంగా హై అలర్ట్... అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం


ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాత్రి పొద్దుపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. యాకుబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో అల్లర్లు పెచ్చరిల్లే అవకాశాలున్నాయని చెప్పిన కేంద్రం, భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సున్నిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాయి.

  • Loading...

More Telugu News