: కలాంకు ఘన నివాళులర్పించిన చైనా


భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు చైనా ఘన నివాళులర్పించింది. ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిన భారత రాజకీయ నాయకుడని, శాస్త్రవేత్త అని, భారత్-చైనా సత్సంబంధాలకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడింది. చైనా-భారత్ మధ్య సత్సంబంధాలు పెంచారని, రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తరువాత కూడా చాలాసార్లు చైనాకు వచ్చారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పెకింగ్ యూనివర్సిటీలో గౌరవ ఆతిథ్య ప్రొఫెసర్ గా విద్యార్థులకు పాఠాలు బోధించారని గుర్తు చేసుకుంది. భారత ప్రభుత్వానికి, ప్రజలకు, కలాం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని చైనా తెలిపింది. కాగా, రాష్ట్రపతి మరణం గురించి చైనా ట్విట్టర్ గా పేరున్న వైబోలో మోదీ విచారం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. కాగా, మోదీకి చైనా వైబోలో గణనీయ సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News