: కలాం రచనలకు పెరిగిన గిరాకీ
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మంచి రచయిత అన్న సంగతి తెలిసిందే. ఆయన పలు పుస్తకాలు రచించారు. వింగ్స్ ఆఫ్ పైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, టార్గెట్ 3 బిలియన్, టర్నింగ్ పాయింట్స్, ఇన్ డామిటబుల్ స్పిరిట్స్, గైడింగ్ సోల్స్..., మై జర్నీ: ట్రాన్స్ ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్, ద సైంటిఫిక్ ఇండియన్, ద ఫ్యామిలీ అండ్ ద నేషన్... తదితర పుస్తకాల ద్వారా ఆయన తన ఆలోచనలను యువతతో పంచుకునే ప్రయత్నం చేశారు. కాగా, ఆయన మరణానికి సంబంధించిన వార్తలు మీడియాలో విశేషంగా ప్రచారం కావడంతో ప్రజల్లో ఆయన పట్ల ఆసక్తి నెలకొంది. ఆయన రాసిన పుస్తకాల కోసం బుక్ స్టోర్లకు తరలి వెళుతున్నారు. బెంగళూరు సహా చాలా నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కలాం రాసిన పుస్తకాల కోసం చాలా మంది వాకబు చేస్తున్నారని, బుక్ స్టోర్ల సిబ్బంది చెబుతున్నారు. అంతేగాకుండా, ఆయన పుస్తకాల ప్రతులను రిజర్వ్ చేసి ఉంచాలని కూడా కోరుతున్నారట. ముఖ్యంగా, కలాం జీవితచరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ నెలకొని ఉందట.