: జైల్లోనే సంజయ్ దత్ 56వ జన్మదినోత్సవం ... ఎరవాడ జైలుకు వెళుతున్న మాన్యత


ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 56వ జన్మదినం నేడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో పూణేలోని ఎరవాడ జైల్లో 42 నెలల జైలు శిక్షను ఆయన అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, జైల్లోనే ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి మాన్యత జైలుకు వెళుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా తన భార్యతో సంజయ్ దత్ కాసేపు గడపబోతున్నారు. జైలుకు వెళుతున్న క్రమంలో, తమ పిల్లలు ఇక్రా, షహ్రాన్ లతో పాటు ఆత్మీయులు, స్నేహితుల శుభాకాంక్షలను మాన్యత తనతో పాటు తీసుకెళుతున్నారు. సంజయ్ దత్ ను కలిసేందుకు మాన్యతకు జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఆయన అంతరంగికులు తెలిపారు. గత రెండు పుట్టిన రోజులను కూడా సంజయ్ దత్ జైల్లోనే జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News