: నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్, సాయిరెడ్డి... ఈడీ దర్యాప్తునకు హాజరు
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు కోర్టు గడప తొక్కారు. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలోని ఈడీ న్యాయస్థానంలో కొద్దిసేపటి క్రితం జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ తో పాటు ఆయన సంస్థల ఆడిటర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ సహా సాయిరెడ్డి, పలువురు మాజీ మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరైన సంగతి తెలిసిందే.