: ఏపీలో తయారుకానున్న 3డి స్మార్ట్ ఫోన్లు... తరలి వచ్చిన అమెరికన్ సంస్థ ఇన్ ఫోకస్


అమెరికా కేంద్రంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, అల్ట్రా హై డెఫినిషన్ (యుహెచ్‌డి) టీవీలను మార్కెటింగ్ చేస్తున్న 'ఇన్ ఫోకస్' ఆంధ్రప్రదేశ్ లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ భారత హెడ్ సచిన్ థాపర్ వివరించారు. ఏపీలోని ఫాక్స్‌ కాన్‌ సెంటర్‌ లో స్మార్ట్‌ ఫోన్లను సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతులు కూడా జరపనున్నట్టు పేర్కొన్నారు. మరో సంవత్సరం వ్యవధిలో భారత మార్కెట్‌ నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 6,300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్టు సచిన్ తెలియజేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో మార్కెటింగ్‌ కోసం రూ. 190 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. త్రీడి కంటెంట్‌ ను ప్రత్యక్షంగా వీక్షించేలా కొత్తగా, ఎం550-3డి స్మార్ట్‌ ఫోన్‌ ను మార్కెట్లోకి తీసుకువచ్చామని, దీనితో త్రీడి చిత్రాలను కూడా తీయవచ్చని ఆయన అన్నారు. దీని ధర రూ. 15,999 అని తెలిపారు. తాము మార్కెటింగ్ చేస్తున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్లనూ ఏపీలో తయారు చేస్తామని, మార్చి 2016 నాటికి 50 లక్షల స్మార్ట్ ఫోన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News