: 'విండోస్ 10' రంగప్రవేశం నేడే... మార్కెట్లోకి విడుదల చేయనున్న మైక్రోసాఫ్ట్


ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘విండోస్ 10’ ఆపరేటింగ్ సిస్టమ్ నేడు మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో కొత్త ఓఎస్ విడుదలకు మైక్రోసాఫ్ట్ భారీ సన్నాహాలు చేసింది. విండోస్ 8 మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో విండోస్ 10పై వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే, మరికొద్ది నెలల్లో అన్నింటా తమ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమే ఉండబోతోందన్న విశ్వాసంతో మైక్రోసాఫ్ట్ ముందడుగు వేస్తోంది. విండోస్ 10కు ప్రాచుర్యం కల్పించేందుకు ఆ సంస్థ భారీ ప్రచారానికి తెరలేపింది. విండోస్ 8 ఫెయిల్యూర్ నేపథ్యంలో విండోస్ 9 మాటెత్తని మైక్రోసాఫ్ట్, నేరుగా విండోస్ 10ను రూపొందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News