: ప్రియాంకను కష్టపెడుతున్న టీవీ సీరియల్
సినిమాల్లో పాత్రకు ప్రాణంపోసే నటిగా పేరున్న ప్రియాంక చోప్రాను ఓ టీవీ సీరియల్ వణికిస్తోంది. 'మేరీకోం' సినిమాలో అత్యంత క్లిష్టమైన పాత్రను సులువుగా పోషించిన ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ సీరియల్ లో నటించడం కష్టంగా అనిపిస్తోంది. 'క్వాంటికో' అనే అమెరికన్ సీరియల్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పదిహేడున్నర రోజుల షూటింగ్ ముగిసిందని తెలిపింది. షూటింగ్ ముగియడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్న ప్రియాంక చోప్రా, 'బాగా అలసిపోయాను, బతికి ఉన్నానో లేదో తెలియడం లేదు' అంటూ ట్వీట్ చేసింది.