: కలాం పార్థివదేహం టెన్ రాజాజీమార్గ్ లోని అధికారిక నివాసానికి తరలింపు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీమార్గ్ లోని అధికారిక నివాసానికి తరలించారు. రక్షణశాఖకు చెందిన ప్రత్యేక వాహనంలో ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహానికి రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రజలను సందర్శనార్థం అనుమతించనున్నారు. మరోవైపు రేపు మధ్యాహ్నం వరకు కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోనే ఉంచనున్నట్టు తెలుస్తోంది.