: కలాంను ఎప్పటికీ గురువుగానే భావిస్తా: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను తాను ఎప్పటికీ గురువుగానే భావిస్తానని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కలాం మృతిపై నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికే కాక యావత్తు ప్రపంచానికే తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కలాం దేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన కీర్తించారు.