: కన్నుమూసిన అబ్దుల్ కలాం
దేశాన్ని తట్టి లేపిన ఓ మేధావి అస్తమించాడు. భవిష్యత్ తరాలు ఎలా మెలగాలో నేర్పిన ఓ గురువు ప్రాణం విడిచారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక ప్రగతిపథం వైపు 'మిసైల్'లా దూసుకుపోయేలా చేసిన మహా శాస్త్రవేత్త ఇకలేరు. 'కలలు కనండి ... వాటిని సాకారం చేసుకోండి' అంటూ అందమైన నినాదాన్నిచ్చి, యువతలో స్పూర్తిని రగిలించిన కలాం మాస్టారు ఇక సెలవంటూ సుదూరతీరాలకు వెళ్లిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులకు భవిష్యత్ నిర్దేశం చేస్తూ ఆయన కుప్పకూలారు. దీంతో ఆయనను బెథానీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేసిన వైద్యులు, తీవ్రమైన గుండెపోటుతో ఆయన మరణించారని నిర్ధారించారు.